నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న జీఎస్టీ

దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. జీఎస్టీలో ప్రస్తుతం నాలుగు శ్లాబు రేట్లు ఉండగా.. అత్యవసర వస్తువులపై 5 శాతం పన్ను రేటు అమలవుతోందని, కార్ల వంటి విలాసవంతమైన వస్తువులపై 28 శాతం పన్నురేటు వర్తిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 12, 18 శాతం పన్ను రేట్ల కింద వివిధ వస్తువులు ఉన్నాయని చెప్పారు.

జీఎస్టీకి ముందు పన్నుమీద పన్ను వల్ల 31 శాతం వరకు పన్ను పడేదని, జీఎస్టీతో పన్ను రేటు తగ్గిందని చెప్పారు. ఇంతకుముందు వ్యాపారులు 495 రకాల దరఖాస్తులు చేసేవారని, జీఎస్టీతో అవి 12కి తగ్గాయని తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకు 44 సార్లు భేటీ అయ్యి వివిధ వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుర్తుచేశారు.