ఏపీలో ఆ నాల్గు జిల్లాలు వణికిపోతున్నాయి..

ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుండి కూడా కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నాల్గు జిల్లాలు మాత్రం భయం తో వణికిపోతున్నాయి. రాష్ట్రం నుంచి నిత్యం కూరగాయలను తీసుకొని అనేక లారీలు చెన్నై లోని కోయంబేడు వెళ్తుంటాయి. తమిళనాడు సరిహద్దు జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు నుంచి ఎక్కువగా కూరగాయలనును చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు తరలిస్తుంటారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా కూరాయలు చెన్నై వెళ్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదవుతున్న కేసులు ఎక్కువగా చెన్నై వెళ్లొచ్చిన వాళ్లకు వస్తుండటంతో దీనిపై అధికారులు దృష్టి పెట్టారు. కోయంబేడుకు వెళ్లొచ్చిన లారీ డ్రైవర్లు, వారు ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు అనే విషయాలను ప్రభుత్వం ఆరా తీస్తోంది.