ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడానికి వయసుతో సంబంధంలేదని నిరూపించింది నాగాలాండ్‌కు చెందిన మూడేళ్ల లిపావి. తనకు జలుబు చేయడంతో ఎవరి సాయం లేకుండా ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చెకప్ చేయించుకుంది. జున్హెబోటో జిల్లాలోని ఘతషి తాలూకాలో హెబోలిమి ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. లిపావి అమ్మానాన్నలు పొలం పనులకు వెళ్లడంతో తన ఇంటికి కొద్దిదూరంలోనే ఉన్న ఆరోగ్య కేంద్రానికి తానే స్వయంగా చెకప్ చేయించుకోవడానికి వెళ్లింది. విషయం తెలుసుకున్న వైద్యులు చిన్నారిని పరీక్షించి జాగ్రత్తగా ఇంటికి పంపించారు.