Site icon TeluguMirchi.com

రాయలసీమకు 300 టిఎంసిల నీరు !

c ramachandrayyaరాయల తెలంగాణపై నేతల్లో భిన్నాబిప్రాయాలు వెలువడుతున్నాయి. అనంతపురం, కర్నూలుకు చెందిన నేతలు రాయల తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తుంటే.. అదే పార్టీకి చెందిన మరికొంత మంది నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా, మంత్రి సి.రామచంద్రయ్య రాయలతెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకమని ప్రకటించారు. రాయలసీమ ప్రాంత కట్టుబాట్లు, సంప్రదాయలు పూర్తి భిన్నంగా ఉంటాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో.. నాలుగు జిల్లాలు కలిసే ఉండాలని కోరుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. అయితే, రాయలసీమకు 300 టిఎంసిల నీటిని రాజ్యాంగబద్దంగా కేటాయించాలని జీవోఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నామని రామచంద్రయ్య వెల్లడించారు. ఇక సమైక్యాంధ్రకోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మంత్రి ప్రశంసలు కురిపించారు. సమైక్యవాదాన్ని సీఎం భుజాన వేసుకుని పోరాడుతున్నారని.. . ఈ విషయంలో ఆయన చిత్తశుద్ధిని అనుమానించవద్దని సూచించారు. సీఎం పదవికి ముప్పు వచ్చినా సమైక్యవాదాన్ని కిరణ్ వీడటం లేదని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.

Exit mobile version