కష్టాల కడలి లో పృద్విరాజ్

ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ నాయకుడు, మాజీ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వి రాజ్ కాల్ లీకేజ్ వివాదం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పృథ్వి రాజ్ వాయిస్ ని పోలి వున్న ఓ కాల్ బయటికి రావడం, ఆ సంభాషణల్లో ఓ మహిళాతో ప్రైవేట్ గా మాట్లాడినట్టుగా వుండటం వివాదానికి కారణం అయ్యింది. దీంతో పృథ్వి రాజ్ అధికార దుర్వినీయోగం చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఎస్వీబీసీ చైర్మన్ స్థాయి వ్యక్తి ఇలా ఓ మహిళతో అనుచితంగా వ్యవవహరించడం సరికాదనే వాదన వినిపించింది. దీనిపై పృథ్వి రాజ్ స్పందిస్తూ.. ”అసలు ఆ వాయిస్ తనది కాదు. గిట్టని వారు చేసిన కుట్ర. రాజకీయ కక్ష్యతో తన వ్యక్తిగత జీవితంపై మచ్చ వేయడం దారుణం. విచారణలో నిజాలు తెలుస్తాయి” అని వివరించారు.

పృద్వీ కేసులో వాస్తవం ఏమిటి ?

ఆరోపణలు రావడంతోనే ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వి రాజ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే ఈ కేసులో బలమైన ఆధారాలు ఏమీ లేవని తెలుస్తుంది. దీనికి కారణం.. ఆ వాయిస్ లో వున్న మహిళా పోలీసుల ముందుకు రావడం లేదు. అలాగే అది పృథ్వి రాజ్ వాయిస్ అని చెప్పడానికి కూడా బలమైన ఆధారాలు లేవు. పైగా వాయిస్ రికార్డులు విచారణలో పనికిరావని సుప్రీం కోర్టు ఏనాడో చెప్పింది. అందుకే దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిరా రాడియా’ కేసులో వాయిస్ ఆధారాలు ఎందుకూ పని చేయలేదు. ఒకవేళ పృథ్వి రాజ్ వాయిస్ వున్న ఆడియో నిజమని నిరూపణ జరిగినా.. అందులో ఎలాంటి అభ్యంతరకరమైన విషయాలు లేవు. ఆ ఆడియో బాగా గమనిస్తే.. గిట్టని మీడియా పృథ్వి రాజ్ మహిళని బలవంతపెట్టడానికి కధనాలు ప్రసారం చేసింది తప్పితే.. ఆ మహిళా తనకు ఇబ్బంది కలిగించేలా పృద్వీ వ్యవహరించారని చెప్పలేదు. అయితే ఒక్కటి మాత్రం క్లియర్.. పృథ్వి రాజ్ ని వ్యక్తిగతంగా దెబ్బకొట్టాలని పన్నిన వల ఈ వాయిస్ లీక్ వివాదం.

పార్టీ కోసం సర్వం కోల్పోయిన పృద్వి:

చాలా కష్టపడి పైకి వచ్చారు పృద్వి. ఆయనది ఓవర్ నైట్ స్టార్ డమ్ కాదు. పరిశ్రమలో ఎన్నో సవాళ్లు ఎదురుకున్నారు. ఎన్నో ఏళ్ళు పట్టింది ఆయనకి పేరు రావడానికి. ఆయన స్టార్ కమెడియన్ గా ఎదిగిన తీరు చాలా మందికి ఆదర్శం. ఎక్కడా కూడ నమ్మకం కోల్పోకుండ పని చేశారు. స్టార్ అయ్యారు. ఒక దశలో ఆయన లేకపోతే సినిమాలో ఏదో వెలితి అనే స్థాయికి ప్రేక్షకులని తీసుకెళ్లారు.

ఐతే సరిగ్గా ఇంత పీక్స్ లో వున్నప్పుడే ఆయన రాజకీయాలవైపు చూశారు. వైసీపీతో నడిచారు. చంద్రబాబు హవా చాలా ఉదృతంగా వున్న రోజుల్లోనే జగన్ వెంట నడిచారు. ఎన్నో విమర్శలు ఎదురుకున్నారు. అటు సినిమా పెద్దలకు కూడా దూరం అయ్యారు. ఆయనకి సినిమా అవకాశాలుతగ్గాయి. టీడీపీతో సున్నితంగా వుండే కొన్ని బ్యానర్లు ఆయనకి సినిమా ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. ఇక ఇండస్ట్రీ పోలరైజ్ చేసి శక్తి వున్న మెగా కుటుంబానికి కూడా ఆయన దూరం అయ్యి కేవలం జగన్వంటనే నడిచారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డారు.

జగన్ పై వచ్చిన ప్రతి విమర్శని తిప్పికొట్టారు. దింతో ఆయనకి చాలా మంది శత్రువులు ఏర్పడ్డారు. ఇలా గిట్టని వారు బురద జల్లడానికి పన్నిన పన్నాగంలో పృద్వి ఈ వివాదంలోకి వెళ్లాల్సివచ్చింది.

ప్రస్తుతం ప్రతిపక్షాలు చేసిన కుట్రల వల్ల కష్ట కాలంలో వున్నారు పృద్వి. నిజనిజాలు తేలకుండానే ఆయన పదవి వదులుకోవాల్సి వచ్చింది. మరి పృద్వి విషయంలో పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలి.

వైసీపీకి టీడీపీకి ఇదే తేడా:

ఈ వ్యవహారంలో వ్యక్తిగత క్షక్యలు పక్కన పెడితే.. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మెచ్చుకోదగ్గది. ఆరోపణలు వచ్చిన వెంటనే.. నిజాలు రుజువయ్యే వరకూ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలనీ వైసీపీ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే రాజీనామా చేశారు పృథ్వి రాజ్. ఇందులో తన తప్పులేదని, ఈ విషయాన్ని నిరూపించి తీరుతానని అంటున్నారు పృథ్వి రాజ్.

కానీ టీడీపీ ప్రభుత్వం వున్నప్పుడు పరిస్థితి ఇలా లేదు. టీడీపీ హయంలో ఆ పార్టీ నాయకులు, అనుచరులపై లెక్కలెనన్ని ఆరోపణలు. ఒక మహిళా ఎమ్మార్వోపై పార్టీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు. ఆమెను తీవ్రంగా దూషించాడు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం. కానీ టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు కదపలేదు. చిన్న చర్య కూడా తీసుకోలేదు. పైగా ఆ ఎమ్మెల్యే ఈ మధ్య రౌడీ షీట్ లో జైలుకి వెళ్లి వస్తే.. ”నేనున్నాను” అంటూ భరోసా ఇచ్చారుచంద్రబాబు. అదేదో ఫ్రీడం ఫైట్ కి వెళ్ళిన యోధడికి ఓదార్పు ఇచ్చినట్లు.

అదే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన’కాల్ మనీ సెక్స్ రాకెట్’ స్కామ్ చంద్రబాబు హయంలోనే జరిగింది. ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకున్న ఈ స్కామ్ ని నీరుగార్చింది టీడీపీ సర్కార్. కారణం… ఆ పార్టీకొ చెందిన కొందరు ఇందులో ఇన్వాల్ అవ్వడమే.

కానీ వైసీపీ సర్కార్ మాత్రం ఒక వాయిస్ కాల్, అదీ కూడా.. నిజమా ? మార్ఫింగా ? అనేది ఇంకా తేల్లేదు. కానీ వెంటనే చర్యలు తీసుకొని, విచారణకు ఆదేశించి, తన నిబద్దతని చాటుకుంది.