అసత్య వార్తలు ప్రసారం చేస్తోన్న 3 యూట్యూబ్ ఛానళ్లను నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది. న్యూస్ హెడ్‌లైన్స్,సర్కారీ అప్‌డేట్,ఆజ్‌తక్ లైవ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ 3ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. వీటికి మొత్తంగా దాదాపు 33 లక్షల మందికిపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ మూడు ఛానళ్లు ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ధర్మాసనం, సీజేఐ, ఈసీ, ఈవీఎంలు, ఆధార్, పాన్‌కార్డులతోపాటు వివిధ ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం వెల్లడించింది.