ట్రంప్‌కు రెండోసారి కరోనా టెస్ట్..రిజల్ట్ ఏం వచ్చిందంటే

అమెరికా లోను కరోనా తాకిడి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేలమంది కరోనా కారణంగా మరణించగా ..లక్షల మందికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌‌గా వచ్చినట్టు ట్రంప్‌ వ్యక్తిగత వైద్యుడు సీన్‌ పి కాన్‌లీ వెల్లడించారు. కేవలం 15 నిమిషాల్లోనే రిపోర్టు వచ్చిందని, అధ్యక్షుడికి కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ సైతం ఈ విషయం స్వయంగా ప్రకటించారు.

మార్చిలోనూ ట్రంప్‌నకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో సహా ఆయన కమ్యూనికేషన్‌ చీఫ్‌ ఫాబియోతో భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీ జరిగిన రెండు రోజుల తర్వాత ఫాబియోకు కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా కోవిడ్ సోకిందేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో అమెరికా అధ్యక్షుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అప్పుడు కూడా నెగెటివ్‌గా వచ్చింది. ఇప్పుడు నెగిటివ్ రిపోర్ట్ రావడం అంత ఊపిరి పీల్చుకున్నారు.