రాష్ట్రంలో 234 కరువు మండలాలు : సీఎం

cm kiranరాష్ర్టం ప్రభుత్వం ఈరోజు కరువు మండలాను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరవు మండలాలను ప్రకటిస్తూ…సంబంధిత దస్త్రంపై సంతకం కూడా చేశారు. రాష్ట్రంలో మొత్తం 234 మండలాలను కరవు మండలాలుగా రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది.

ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలలో జిల్లాల వారిగా అనంతపురం 63, కడప 43, కర్నూలు 36, ప్రకాశం 35, చిత్తూరు 28, నల్గొండ 11, నెల్లూరు 9, మహబూబ్నగర్ 5, గుంటూరు 4 ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన రాయలసీమలోని ఎక్కువ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. తెలంగాణ జిల్లాలలో నల్గొండ, మహబూబ్ నగర్ తప్ప ఇంకా ఏ తెలంగాణ జిల్లాలలో కూడా కరువు లేనట్లుగా ప్రభుత్వం ప్రకటించన కరువు మండలాల ద్వారా అర్థమవుతుందని సమాచారం.