దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. మరోవైపు కరోనా నుండి కోలుకున్నాక కొంతమందికి బ్లాక్ ఫంగస్ సోకుతుంది. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 23 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆరుగురు మృత్యువాత పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో అకస్మాత్తుగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖను కలవరానికి గురిచేస్తోంది. కరోనా తరువాత కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్యశాఖ నివారణ చర్యలకు దిగింది. ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాధిగ్రస్తులను గుర్తించడం,చికిత్సకు తరలించే చర్యలు చేపడుతున్నారు.