Site icon TeluguMirchi.com

జగన్‌కు 2019 ఎన్నికలు తాడో పేడో..!

ys jaganఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కొద్ది తేడాతో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ సీఎం పీఠంను కోల్పోయాడు. తనపై ప్రజల్లో నమ్మకం ఉందని, తన తండ్రి చేసిన పనుల వల్ల తనను ప్రజలు ఆధరిస్తారనే నమ్మకంతో వైఎస్‌ జగన్‌ ఉన్నాడు. అందుకే 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం అయ్యేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకు అయినా సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు మొత్తం 500 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఇప్పటికే 250 కోట్లను చెల్లించిన జగన్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒప్పందం చేసుకున్న మొత్తానికి ఎక్కువే ఇస్తాను అంటూ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాని ప్రశాంత్‌ కిషోర్‌ వేసిన వ్యూహాలు ఇప్పటి వరకు సక్సెస్‌ అయిన ధాఖలాలు లేవు. జగన్‌కు ఆయన ఇస్తున్న సలహాలు ప్రస్తుతానికి వర్కౌట్‌ కాలేదు. అయితే ఎన్నికల సమయానికి పీకే ఇచ్చే సలహాలు చాలా కీలకం కాబోతున్నాయి.

ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి రాకుండా రెండు పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు మనుగడ సాగించడం చాలా కష్టం. అందుకే జగన్‌ పార్టీ నిలవాలి అంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్‌ సీఎం అవ్వాల్సి ఉంది. అయితే పరిస్థితులు చూస్తుంటే జగన్‌ సీఎం అవ్వడం కాస్త అనుమానమే అనిపిస్తుంది. చూద్దాం ఎన్నికలకు ఇంకా సంవత్సరంకు ఎక్కువ సమయం ఉంది. అప్పటి వరకు ఏమైనా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Exit mobile version