Site icon TeluguMirchi.com

20 యూట్యూబ్‌ ఛానల్స్‌, రెండు వెబ్‌సైట్లను నిషేదించిన కేంద్రం

కొత్త ఐటీ చట్టం కింద 20 యూట్యూబ్‌ ఛానల్స్‌, రెండు వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పాకిస్తాన్‌ నుంచి భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న వీటిని కొత్త ఐటీ చట్టంలోని నిబంధనల మేరకు నిషేధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ యూట్యూబ్‌ ఛానల్స్‌ను వెంటనే నిషేధించాల్సిందిగా యూట్యూబ్‌కు, డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ టెలికాంకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర లేఖ రాశారు.

నయా పాకిస్తాన్‌ పేరుతో నడుస్తున్న యూట్యూబ్‌ ఛానల్‌కు 20 లక్షలకు పైగా సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారని…ఈ సంస్థ కాశ్మీర్‌, కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం, అయోధ్య వంటి అంశాల ఆధారంగా భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నయా పాకిస్తాన్‌ గ్రూప్‌తోపాటు ద నేకెడ్‌ ట్రూత్‌, 48 న్యూస్‌, జునైద్‌ హాలిమ్‌ అఫిషియల్‌ వంటి యూట్యూబ్‌ ఛానల్స్‌ను భారత్‌ నిషేధించింది. ఈ మొత్తం 20 యూట్యూబ్‌ ఛానల్స్‌ 35 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారని, 50 కోట్ల వ్యూస్‌ ఉన్నాయని కేంద్ర ప్రకటించింది.

Exit mobile version