18గురువారం విశ్వాస పరీక్షకు రెడీ కండి

కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై స్పీకర్ అధికార ర్టీకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తాజా రాజకీయ పరిణామాలతో సీఎం కురస్వామి బలపరీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందుకు స్పీకర్‌ రమేశ్ కుమార్‌ అధికార పక్షానికి కొంత సమయమిచ్చారు. ఈ నెల 18న (గురువారం) ఉదయం 11 గంటలకు విధానసభలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

కాగా జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై రాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారిన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని.. శాసనసభలో విశ్వాసపరీక్షకు రెడీగా ఉన్నానని… గత శుక్రవారం సీఎం కుమారస్వామి స్వయంగా ప్రకటించడంతో కర్ణాటక రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. అయితే సీఎం స్వయంగా బలపరీక్షను ఎదుర్కొంటానని చెప్పడంతో  సోమవారమే విశ్వాస పరీక్ష పెట్టాలని బీజేపీ పట్టుబట్టింది. ఇందుకు స్పీకర్‌ నిరాకరించారు.

కాగా కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. వీరి రాజీనామాలు ఆమోదించాలని సుప్రీంకోర్టు రేపు తీర్పు వెల్లడిస్తే.. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కి తగ్గుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్‌ 105 అవుతుంది. శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 107 (ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి). రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తీసేస్తే సంకీర్ణ ప్రభుత్వ సంఖ్యా బలం 101(స్పీకర్‌తో కలిపి). ఈ విపత్కర పరిస్థితుల్లో విశ్వాస పరీక్షలో కుమారస్వామి నెగ్గడం చాలా కష్టసాధ్యమనే చెప్పాలి.