18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్యాన్ చేసిన కేంద్రం


సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వివిధ మధ్యవర్తుల సమన్వయంతో, అశ్లీలమైన, అసభ్యకరమైన, కొన్ని సందర్భాల్లో అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేసే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. వీటితో సంబంధం ఉన్న 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా ఖాతాలు భారతదేశంలో పబ్లిక్ యాక్సెస్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. సృజనాత్మక వ్యక్తీకరణ’ ముసుగులో అశ్లీలత, అసభ్యతను ప్రచారం చేయకూడదని కేంద్ర సమాచార, ప్రసారాలమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పలు వేదికల ద్వారా పదేపదే నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేసే 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను తొలగించినట్లు ఠాకూర్ ప్రకటించారు. బ్లాక్ చేసిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లతో డ్రీమ్స్ ఫీల్స్, Voovi, Yessma, Uncut Adda, Tri Flicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix, వంటివి ఉన్నాయి.