13వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు భారత్ నేతృత్వంలో ఈ నెల 9న జరగనుంది. 2012, 2016 తర్వాత బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వటం ఇది మూడోసారి. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ అంతర్గత సహకారం కొనసాగింపు, ఏకీకరణ, ఏకాభిప్రాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారొ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోస తదితరులు హాజరవుతారు.