Site icon TeluguMirchi.com

11మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

Parlimentపార్లమెంట్ లో ఆందోళనకు దిగిన 11 మంది సీమాంధ్ర ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు నిరసనలు వ్యక్తం చేయడంతో పదకొండు మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇందులో నలుగురు టీడీపీ, ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వారిని సస్పెండ్ చేస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, తీర్మానాన్ని మిగతా పార్టీల సభ్యులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. సభ్యుల సస్పెన్షన్ సరికాదంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్ర సభ్యులు వెల్ లోకి వెళ్లి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో స్పీకర్ తీర్మానానికి ఓటింగ్ జరిపేందుకు సిద్ధమయ్యారు. వెంటనే పోడియం వద్దకు వెళ్లిన సభ్యులు మైక్ లు లాగేశారు. దాంతో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో స్పీకర్ సభను మధ్యాహ్నం 12.45 నిమిషాల వరకు వాయిదా వేశారు.

Exit mobile version