దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలు

2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు కేవలం 75 విమానాశ్రయాలే నిర్మాణమయ్యాయని పేర్కొన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు 7 కొత్త విమానాశ్రయాలు నిర్మించారన్నారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్‌లో ఆశీర్వాద్‌ యాత్ర ప్రారంభించారు. పేదలు విమానంలో ప్రయాణించాలన్న ప్రధాని మోదీ కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ లో చిక్కుకున్న భారత పౌరులందరినీ సురక్షితంగా తీసుకువస్తామన్నారు.