Site icon TeluguMirchi.com

హరికృష్ణ స్మారక చిహ్నన్నీ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సర్కార్ తరపున సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఉండి హరికృష్ణ అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.

అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది. నందమూరి హరికృష్ణ స్మారక స్థూపం కోసం 450 గజాల స్థలం కేటాయిస్తామని తెలంగాణ సర్కార్ తరపున సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ స్మారక స్థూపం నిర్మాణం మొదలు ఖర్చులన్నీ తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు.

Exit mobile version