సెప్టెంబ‌ర్ 7 నుండి తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల తేదీల‌ను ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. అసెంబ్లీ వ‌ర్షా‌కాల స‌మావేశాల‌ను సెప్టెంబ‌ర్ 7వ తేదీ నుంచి 20 రోజుల పాటు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, అసెంబ్లీ సెక్ర‌ట‌రీ వీ న‌ర‌సింహాచార్యుల‌తో పాటు ఇత‌ర అధికారుల‌తో చ‌ర్చించారు.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స‌మావేశాల్లో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు సీఎం. ఈ నేప‌థ్యంలో మంత్రులు, సంబంధిత అధికారులు.. అన్ని అంశాలతో సిద్ధంగా ఉండాల‌ని సీఎం ఆదేశించారు.