Site icon TeluguMirchi.com

సీఎంగా యోగి.. మోడీ వ్యూహం అదుర్స్‌

modi yogiదేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులతో పాటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఏ ఒక్కరి సాయం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లను సాధించింది. చాలా సంవత్సరాల తర్వాత అత్యధిక మెజార్టీతో ఒక పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ గెలుపులో మోడీ పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూపీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ పలు సభలు, ర్యాలీలు జరిపారు. పక్కా వ్యూహంతో యూపీలో ఘన విజయం సాధించారు.

యూపీ ఎన్నికల్లో విజయం తర్వాత ఎవరు సీఎం అవుతారు అని దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే చివరకు మోడీ నిర్ణయం మేరకు ఎంపీ, పచ్చి హిందుత్వ వాది అయిన యోగి ఆదిత్యనాథ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హిందు ఓటర్లను ఆకర్షించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడని కొందరు అంటున్నారు.

యూపీతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా హిందుత్వం పేరుతో ఓట్లు అడిగేందుకు మోడీ తీసుకున్న నిర్ణయం ఉపకరిస్తుందని బీజేపీ నాయకత్వం కూడా భావిస్తుంది. యోగి ఆదిత్యనాథ్‌పై ఎన్నో ఆరోపణలు మరెన్నో వివాదాలు ఉన్నాయి. అయినా కూడా ఆయనపై నమ్మకంతో పార్టీకి ఆయన తప్పకుండా బలాన్ని చేకూర్చుతాడనే నమ్మకంతో ఈ బాధ్యతలను మోడీ అప్పగించారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపిక జరిగిందని 100% శాతం చెప్పవచ్చు.

Exit mobile version