వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించవద్దని, కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం జగన్, తనతో పాటు అఖిలపక్షాన్ని కూడా తీసుకు వస్తానని పేర్కొన్నారు. కాగ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదనే ఒక్క ఛాన్స్ అనుమానం వుంటే అవన్నీ పటాపంచలూ చేస్తూ పక్కా క్లారిటీగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నిండు పార్లమెంట్ ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు మీద ఆశలు వదిలేసుకోమని తేల్చి చెప్పేశారు.
కేంద్రం చేసిన ఒక్క ప్రకటనతో విశాఖ ఇపుడు అగ్గి మీద కూర్చుంది. రాత్రికి రాతే ఉద్యమం ఉప్పెనలా లేచింది. ఉక్కు కార్మికులు, ఆందోళనకారులు విశాఖలో రోడ్లమీదకు వచ్చి మొత్తం స్థంభింపచేశారు. దాంతో జాతీయ రహదారి మీద ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. మరో వైపు కార్మికులు ఉక్కు కర్మాగారాన్ని ముట్టడిస్తున్నారు. కేంద్రం తన ప్రకటన వెనక్కు తీసుకోవాలని లేకపోతే విశాఖ రగిలితీరుతుందని చెబుతున్నారు.ఈ నేపధ్యంలో జగన్ మోడీ అపాయింట్మెంట్ కోరారు. మరి ఏం అవుతుందో చూడాలి.