Site icon TeluguMirchi.com

వైకాపా, తెదేపాపై ఎలక్టోరల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌

వైకాపా, తెదేపాపై ఎలక్టోరల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాల్సిన అవసరముందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తిరుపతి ఉపఎన్నికలో ప్రజలే ఆ రెండు పార్టీలకు సరైన సమాధానం చెబుతారన్నారు. తెలంగాణలో ఒక సర్జికల్‌ స్ట్రైక్‌ అవసరమైతే.. ఏపీలో ట్విన్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ అవసరమని వైకాపా, తెదేపాను ఉద్దేశించి జీవీఎల్‌ వ్యాఖ్యానించారు. ఓటర్లే వారిపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తారన్నారు.

Exit mobile version