Site icon TeluguMirchi.com

వెల్‌స్పన్ కంపెనీని ప్రారంభించిన కేటీఆర్

షాబాద్ మండలం లోని చందన వెళ్లిలో నూతనంగా వెల్‌స్పన్‌ కంపెనీని తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

వెల్‌స్పన్‌ పరిశ్రమ పలు ఉత్పత్తుల్లో పాలు పంచుకోబోతోంది.. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 1800 మందికి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లోనే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి.. సుమారు ఎనిమిది వేల కోట్లతో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమల ద్వారా కనీసం పదివేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ఓ అంచనా.

Exit mobile version