Site icon TeluguMirchi.com

వెన్నుపోటులో భాగమైన జగన్ !

వెన్నుపోటు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ఆలోచన లేకుండా మాజీ సిఎం చంద్రబాబు నాయుడు పేరు గుర్తుకు వస్తుంది. మామ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి సిఎం కుర్చీని లాక్కున్న వ్యక్తిగా అపవాదు ఎదురుకుంటున్నారు చంద్రబాబు. వెన్నుపోటు కు ఆయన బ్రాండ్ అంబాసిడరని ప్రతి పక్షాలు సెటైర్లు వేస్తుంటాయి. ఐతే ఇప్పుడీ వెన్నుపోటు బ్రాండ్ లో జగన్ మోహన్ రెడ్డిని కూడా బాగం చేసింది టీడీపీ.

జగన్ సోదరి షర్మిల సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం నడుం కట్టారు. అన్న జగన్ పార్టీ ఏపీ లో రూలింగ్ లో వుండగా చెల్లి తెలంగాణ పార్టీ పెట్టి సంచలనాలు తెర తీసింది. ఐతే ఈ పాయింట్ ని తెలుగు దేశం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. షర్మిల, జగన్ జైల్లో వున్నప్పుడు బస్సు యాత్ర చేసి పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళారు. ఆమె పాత్ర పార్టీ లో చాలా కీలకం. అలాంటింది అధికారం వచ్చిన తర్వాత షర్మిలని జగన్ సైడ్ చేశారనే ఓ వాదన వుంది.  బాధతో షర్మిల కొత్త పార్టీ పెట్టుకొని మళ్ళీ తన మనుగడ కోసం పోరాటం చేస్తున్నారని చెబుతున్నారు కొందరు. 

ఐతే చెల్లికి న్యాయం చేయని జగన్ మోహన్ రెడ్డి  రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని టీడీపీ పాయింట్ లాగింది. షర్మిల పార్టీ కోసం కష్ట పడితే ఆమెను వెన్నుపోటు పొడిచి పార్టీ నుండి వెళ్ళగొట్టారని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్వయంగా చంద్రబాబే .. చెల్లికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వెన్నుపోటు గురించి మాట్లడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మొత్తానికి షర్మిల రూపంలో జగన్ వ్యతిరేక పక్షాలకు కొత్త ఆయుధం దొరికింది. మరి ఈ విమర్శలని వైసీపీ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

Exit mobile version