Site icon TeluguMirchi.com

లోకేష్ బాబు ఏమిటీ పీకుడు మాటలు

టీడీపీ పరిస్థితి బాలేదు . వరుస ఓటములు. పంచాయితీ , మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు అయిపోయిన పరిస్థితి . నాయకుల్లో తీవ్ర అసహనం నెలకొంది. నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం . చంద్ర బాబు కి సి ఐ డి నోటీసులు వచ్చిన నేపధ్యం లో లోకేష్ సహనం కోల్పోయారు.

”తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి వైఎస్ జ‌గ‌న్ పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది.అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు? 21నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి,ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు.సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు.అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది.” అని ట్వీట్ చేశారు లోకేష్.

లోకేష్ మాటలు గమనిస్తే ఆయన లో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. పీకుడు వెంట్రుక లాంటి మాటలు పద్ధతి కాదు . సహనం కోల్పోతే గానీ ఇలాంటి మాటలు రావు . ఏమైనా ఇంత అసహనం మాత్రం రాజకీయాల్లో మంచిది కాదు .

Exit mobile version