లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కరోనా పరీక్షలు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎక్కువ గా ఉన్న నేపథ్యంలో ఏచిన్న జ్వరం , కాస్త అనారోగ్యం గా అనిపించినా వెంటనే కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. తాజాగా బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే లాలూకు కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం జార్ఖండ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన గత కొద్ది రోజుల నుంచి రాజేంద్ర ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆయన నుంచి నమూనాలను సేకరించినట్లు డాక్టర్‌ ఉమేష్‌ ప్రసాద్‌ తెలిపారు. పశువుల దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.