ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం బుధవారం ఆవిష్కృత మైంది. దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ.. శత్రు భయంకర ఐదు రఫేల్ యుద్ధ విమానాలు మన భూభాగంపై అడుగు పెట్టాయి. దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది.
రఫేల్ యుద్ధ విమానాల నుంచి అత్యాధునికమైన ఆయుధాలను ప్రయోగించవచ్చు. 9500 కేజీల బరువైన ఆయుధాలను ఈ విమానాలు మోసుకెళ్లగలవు. ఈ యుద్ధ విమానాల నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించవచ్చు. ఇక రఫేల్ యుద్ధ విమానంలో రెండు రకాల క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉన్నది. అందులో ఒకటి 150 కిలోమీటర్ల రేంజ్ కాగా, రెండో రకం క్షిపణులు 300 కిలోమీటర్ల రేంజ్. గాలిలో నుంచి గాల్లోకి, గాలిలోనుంచి భూమిమీదకు ఈ విమానాల ద్వారా క్షిపణులను ప్రయోగించవచ్చు. ఇకపోతే, ఈ రఫేల్ యుద్ధ విమానం గంటకు 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది.