జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫై పోరు కు సిద్దమయ్యాడు. పేదలకు ఇళ్ల కేటాయింపులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం (జూలై 22) బీజేపీతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేయబోతున్నాడు. మంగళవారం ఏర్పటు చేసిన సమావేశంలో కరోనా కష్టాలు, ఇళ్లు కేటాయింపు, రేషన్ డీలర్ల ఆందోళన, అమరావతి ఉద్యమం వంటి అంశాలపై నాయకులతో ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జి+ గృహాల కేటాయింపు వ్యవహారంలో లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు జనసేన, బీజేపీ సంయుక్తంగా పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు. లబ్ధిదారులు తమ వాటా డబ్బు చెల్లించినా ప్రభుత్వం మారిపోవడంతో ఇళ్లు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. గృహ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. దీని కోసం చేయబోయే ధర్నాను జయప్రదం చేయాలని పవన్ పిలుపునిచ్చారు.