తెలుగుదేశం పార్టీ కి మరో దెబ్బ పడబోతోంది. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పేసి అధికార వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. ఇప్పటికే సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆగస్టు 15న అధికార పార్టీకి జై కొడతారని సమాచారం.
సీఎం జగన్తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను జరిపి అధినేతతో కూడా ఓకే చెప్పించారట. విశాఖ జిల్లా బాధ్యతలు చూసుకుంటున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతికి తెలియకుండానే గంటా పార్టీలో చేరేందుకు పావులు కదిపారట. వైఎస్సార్సీపీలో కీలకంగా, ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితంగా ఉండే నేతతో మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది.