Site icon TeluguMirchi.com

పాపం .. తలసానికి మేటర్ తెలీదు !

జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారని…కానీ తనకు 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల విషయంలో కాగితాలపై ఉన్న లెక్కలు.. క్షేత్రస్థాయిలో చూపించడం లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి మాట్లాడారు.

లక్ష ఇళ్లు కట్టలేదనే విషయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తెలియక తనతో ఛాలెంజ్‌ చేశారని భట్టి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములని చూపిస్తే ఇళ్లు కట్టిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారని.. దాని ప్రకారం లక్ష ఇళ్లు కట్టలేదని ఒప్పుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం సాధించింది వ్యాపారం చేయడానికి కాదని భట్టి విమర్శించారు. ఫార్మా పేరు చెప్పి ఈ ప్రaభుత్వం 7,950 ఎకరాల భూమిని తీసుకుందని ఆయన ఆరోపించారు.

Exit mobile version