దిగిరాకుంటే.. ధిక్కారమే !

kavuri purandeswariకాంగ్రెస్ అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు రెడీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కేంద్రం ప్రకటన చేసిన తరవాత అన్ని పార్టీలు పునరాలోచనలో పడ్డాయని.. అధిష్టానం కూడా పునరాలోచన చేయాలని వారు సూచిస్తున్నారు. ఒకేవేళ కాంగ్రెస్ పునరాలోచన చేయని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామని తేల్చిచెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కేంద్రమంత్రులు కావూరి, పురంధేశ్వరి సమావేశమయి సమాలోచనలు జరిపారు. విభజన విషయంలో కేంద్రం దిగిరాకుంటే.. మంత్రిపదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీమాంద్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతుండటంతో.. ఇక పదవుల్లో కొనసాగలేమని మంత్రులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు సమైక్య ఉద్యమం 31వ రోజుకు చేరిన విషయం తెలిసిందే.