Site icon TeluguMirchi.com

తెలంగాణ సర్కార్ కు కిషన్ రెడ్డి సలహా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి పెరగడమే తప్ప తగ్గడం లేదు. ప్రతి రోజు వందల సంఖ్య లో కేసులు పెరుగుతుండడం తో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి టీమ్స్, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రులన సందర్శించారు.

ఈ సందర్భాంగా మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సర్కార్‌కు కీలక సూచనలు చేశారు. టెస్టులు ఎంత ఎక్కువగా చేస్తే కరోనాను అంతగా కట్టడి చేయొచ్చని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానాన్ని అనుసరించాలన్నారు. కరోనాను కట్టడి చేయడంలో అన్ని రాష్ట్రాలు దేశరాజధాని ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఢిల్లీలో రికవరీ రేటు 84 శాతంగా ఉందన్నారు. ఆగష్టు నెలలో ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. టిమ్స్ ఆస్పత్రిలో మరింత అభివృద్ధి చేసి సదుపాయాలను కల్పించాలని కేసీఆర్ ను కోరారు.

Exit mobile version