తెలంగాణ రాష్ట్రం కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు..GHMC పరిధిలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మిగతా జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పట్టణం వదిలి అంత సొంతర్లకు వెళ్తుండడం తో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా 1473 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 55,532కి చేరింది. ఇందులో 12,955 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 42,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 8 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 471 కరోనా మరణాలు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసులు చూస్తే..
ఆదిలాబాద్ లో 28, భద్రాద్రి కొత్తగూడెంలో 10, జీహెచ్ఎంసి లో 506, జగిత్యాలలో 18, జనగాంలో 10, భూపాలపల్లిలో 10, జోగులాంబ గద్వాల్ లో 32, కామారెడ్డి 17, కరీంనగర్ 91, ఖమ్మంలో 20, మహబూబ్ నగర్ 8, మహబూబాబాద్ 34, మంచిర్యాల 14, మెదక్ 17, మేడ్చల్ 86, ములుగు 12, నగర్ కర్నూల్ 19, నల్గొండ 28, నారాయణ్ పెట్ 2, నిజామాబాద్ 41, రాజన్న సిరిసిల్ల 19, రంగారెడ్డి 168, సంగారెడ్డి 98, సిద్ధిపేట 12, సూర్యాపేట 32, వికారాబాద్ 2, వనపర్తి 9, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 111, యాదాద్రి లో 11 కేసులు నమోదయ్యాయి.