తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. శనివారానికి సంబందించిన హెల్త్ బుల్టిన్ ను విడుదల చేయగా ..రాష్ట్రంలో కొత్తగా 1819 కరోనా కేసులు నమోదు అయ్యినట్లు తెలిపింది. దీంతో మొత్తం కేసులు 66,677కు చేరాయి.
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 47,590 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 18,547 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 10 మంది మరణించడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 540కి చేరాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 517 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్ జిల్లాలో 146, వరంగల్ అర్బన్‌లో 138 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.