Site icon TeluguMirchi.com

తెలంగాణ కొత్త సచివాలయం విశేషాలు

తెలంగాణ సర్కార్ ..కొత్త సచివాలయాన్ని ఏర్పటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పాత సచివాలయాన్ని కూల్చేవేత పనులు నడుస్తున్నాయి. కాగా కొత్త సచివాలయం ఎలా ఉండాలని..పనులు ఎప్పుడు పూర్తి చేయాలనీ ..మొదలు వివరాలను అధికారులకు తెలిపారు కేసీఆర్. సచివాలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల పనులనూ ఒకేసారి ప్రారంభించేయాలనీ… ఎక్కడా ఆలస్యం కావడానికి వీల్లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. 20 రోజుల్లో కూల్చివేత పనులు, శిథిలాల తరలింపు పూర్తవ్వాలన్నారు.

శ్రావణ మాసంలోనే కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభమవుతుందని అధికారులు చెపుతున్నారు. ఇందుకోసం… ఎక్కడెక్కడి నుంచే ఏవేవో తెప్పించకుండా… స్థానిక వనరులతోనే కొత్త భవన నిర్మాణం ఉండనుందని చెపుతున్నారు. నక్షత్ర నమూనాలో ఉండే కొత్త భవనంలో సౌకర్యాలు, ఛాంబర్లు, ఫ్లోర్లు, ల్యాండ్ స్కేప్ లు, పార్కింగ్, గుడి, బడి, మసీదు, బ్యాంకు ఇతర స్పెసిఫికేషన్స్‌పై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి, అధికారులతో సీఎం కసరత్తు చేశారు. త్వరలోనే టెండర్లు పిలవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. సీఎం చెప్పినట్లుగా కొత్త సచివాలయ కసరత్తు మొదలుపెట్టిన అధికారులు, నేడు ఆర్థికశాఖకు సమీకృత కొత్త సచివాలయం ప్రతిపాదనలు పంపనున్నారు.

Exit mobile version