ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రగతీ భవన్ లో జరిగే ఈ సమావేశంలో నూతన సచివాలయ నిర్మాణం , కరోనావైరస్ పై తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, విద్యాసంవత్సరం వంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.