తాతగారి.. పార్టీలోనే మనవడు..!

jr-ntrఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంపై.. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అబ్బాయి(జూ. ఎన్టీఆర్) స్పందించాల్సిందేనని బాబాయ్(బాలకృష్ణ) హుకుం జారీచేసిన నేపథ్యంలో.. ‘బాద్ షా’ విజయోత్సవ వేడుక వేదికగా.. జూ.ఎన్టీఆర్ స్పందిస్తూ.. తన వంట్లో నందమూరి రక్తం ప్రవహిస్తోందని, తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీకి ఎల్లప్పుడూ.. అండగా ఉంటానని ఉద్వేగంగా అన్నారు. తనకు సంబంధం లేని వివాదాల్లోకి లాగవద్దని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘బాద్ షా’ సినిమా పెద్ద హిట్ అయిన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నానని, ఇలాంటి సమయాల్లో దయచేసి వివాదాల్లోకి లాగవద్దన్నారు. దీంతో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.