ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ఉదయం పులివెందులలో తన మామ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో జగన్ పాల్గొన్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం నేరుగా ఢిల్లీకి వెళ్ళారు. జగన్ తో పాటు 10 మంది బృందం ఢిల్లీకి వెళ్ళింది.
రేపు నదీ జలాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి సంబంధిత అధికారులకు జగన్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రధాని మోదీని కలిసేందుకు జగన్ కు అపాయింట్ మెంట్ ఖరారైంది. మోదీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై జగన్ చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నారు.