ట్యాపింగ్‌: ప్రధానికి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. తన ఫోన్ ట్యాప్ అవుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ సారి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా.. ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని.. ఇది దేశభద్రతకు భంగం కలిగించడమేనని చెబుతూ.. తక్షణం విచారణ చేయించాలని కోరుతూ… కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు.


ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19 మరియు 21 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని… ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని… ప్రజా స్వామ్య వ్యవస్థలను నాశనం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు లేఖలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.