Site icon TeluguMirchi.com

టీడీపీ కి కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని

టీడీపీ నేత ట్టాభిరామ్ పై దాడి నేపథ్యంలో వైసీపీ నేతలపై చంద్రబాబు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.  ఘాటైన పదజాలంతో ఆయన విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబునాయుడు బతుకే అబద్ధాల బతుకు అని విమర్శించారు. శవరాజకీయాలకు చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు.

నాడు ఎన్టీఆర్ పై మల్లెల పద్మనాభంతో దాడి చేయించి దాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా వ్యూహం పన్నిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. తన పిల్లలను తానే ఆరగించే పాము లాంటి వాడు చంద్రబాబు అని, టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నవాళ్లు ఈ విషయం గుర్తెరగాలని కొడాలి నాని అన్నారు. 

Exit mobile version