Site icon TeluguMirchi.com

జేఏసీనే మా అధిష్టానం:టీజీ

TG-Venkatesh-addressing-Media-at-CLP-2కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఓట్లు, సీట్లు కోసం ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాయని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో న్యాయవాదుల జేఏసీ చేతిలో చేదు అనుభవం చవిచూసిన అనంతరం మంత్రి టీజీ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే లాభపడాలని ఆశిస్తున్న వైఎస్సార్సీపీ నేతలే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పార్టీల అధినేతలందరూ ద్వితీయశ్రేణి నాయకులను నిండా ముంచారని దుయ్యబట్టారు. అందుకే సమైక్యాంధ్ర జేఏసీనే తమ అధిష్ఠానంగా భావిస్తున్నామని తెలిపారు.

కర్నూలులోని కృష్ణదేవరాయల విగ్రహం వద్ద సమైక్యవాదులు తనను అడ్డుకోవడంపై టీజీ వెంకటేష్ పడ్డారు. నలుగురైదుగురితో రాళ్లెయిస్తే దాన్ని ఉద్యమం అంటారా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం తాను ఎంతో కాలంగా పనిచేస్తున్నానని చెప్పారు. జేఏసీ రాజీనామా చేయమంటే తక్షణమే చేస్తామని చెప్పారు. తాము అధికారంలో ఉండబట్టే హైదరాబాద్లో ఏపీ ఎన్జీవోల సభకు అవకాశం కల్పించగలిగామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అనుకూలంగా లేఖ ఇచ్చిన నాయకుడు యాత్ర చేస్తున్న పట్టించుకోకుండా తనను అడ్డుకోవడం తగదని అన్నారు.

Exit mobile version