జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో కేడర్ లో జోష్ నింపారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతగానే ప్రభావశీలంగా పని చేశారని ఎన్నికల ఫలితాలు ఎంతో సంతృప్తినిచ్చాయని చెప్పుకొచ్చారు . ప్రజల్లో మార్పు కనిపిస్తోందని… దానికి తమ పార్టీ మద్దతుదారులకు వచ్చిన ఓట్లు సీట్లే సాక్ష్యామని ఆయన మీడియాకు వివరించారు. గణనీయ సంఖ్యలో జనసేన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారని… కనీసం పదిహేడు వందల పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచారు.. ఈ లెక్కన చూస్తే.. తమకు పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయని ప్రకటించారు.
నిజంగా ఈ ప్రకటనలో నిజాలు వుంటే మాత్రం.. జనసేనకి పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చివుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కు ఇదే సరైన సమయం. ఇప్పటి వరకూ జనసేన .క్యాడర్ అంటే.. కేవలం పవన్ ఫ్యాన్స్ మాత్రమే. ఒకవేళ పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటనలో వాస్తవం వుంటే గనుక ఆయనకి గ్రామ స్థాయిలో కూడా ఒక క్యాడర్ ఏర్పడినట్లే భావించాలి. ఇదే జోష్ లో పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు చేసి మరింత బలంగా క్యాడర్ ని నిర్మించుకోవాలంటే ఇదే సరైనసమయం అని చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు ఆరు ఓట్లు శాతమే వచ్చాయి. ఇప్పుడు వచ్చిన బలంతో ఇంకా బలంగా తిరిగితే క్యాడర్ ని ఇంకాస్త బలపరుచుకునే అవకాశం వుంది.