ఏపీలో వలంటీర్లు వ్యవస్థ తీసుకొచ్చారు సిఎం జగన్. జీతం కింద ఐదు వేల రూపాయిలు ఇచ్చారు. ఐతే వలంటీర్లు మాత్రం ఈ ఉద్యోగాలు పర్మినెంట్ అయిపోతాయేమో అని ఆశతో వున్నారు. తాజాగా ఒక సంఘంగా ఏర్పడి జీతాలు పెంచాలనే డిమాండ్ కూడా చేశారు. సరిగ్గా ఎన్నికల సమయం చూసుకొని వలంటీర్లు చేసిన ఈ డిమాండ్ ఒక్క సీరియస్ నెస్ జగన్ కి అర్ధం అయ్యింది. అందుకే నాలుగు పేజీల ఉత్తరం రాశారు. ఇందులో చాలా వివరాలు క్లియర్ గా చెప్పేశారు. వలంటీర్లు ఉద్యోగాలు కాదని తేల్చి చెప్పారు. ”ఇది ఉద్యోగం కాదు స్వచ్ఛంద సేవ. వలంటీర్లుగా సేవలందిస్తున్న వారు ఒక్క విషయాన్ని గమనించండి. మీరు కేవలం వారానికి మూడు రోజులు అది కూడా మీకు వీలున్న సమయంలో సేవ చేస్తున్నారు. మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలు ఏమీ లేవు. మీది ఉద్యోగం కాదు సేవ” అని చాలా స్పష్టంగా చెప్పారు జగన్.
జగన్ వలంటీర్లకు రాసిన ఈ వుత్తరంతో ఒక విషయం క్లియర్ అయ్యింది. వలంటీర్లు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రభుత్వం కూడా దిన్ని ఒక ఉద్యోగంగా భావించడం లేదు. వలంటీర్లు వ్యవస్థ పర్మినెంట్ అయిపోయి గవర్నమెంట్ వుద్యోగుల్లా మరిపోతామనే ఆలోచనలు నుండి వలంటీర్లు బయటికి వచ్చేస్తే మంచిది. చాలా మందికి ఈ సంగతి తెలుసు . కానీ కొందరు ఇంకా ఎదో మూల నమ్మకం పెట్టుకుంటే మాత్రంనిరాసనే ఎదురుకోవాల్సి వస్తుంది. వలంటీర్లు అనే వారు వారికి ఆకాశం వున్నప్పుడు సేవ చేసి … మంచి అవకాశాలు వస్తే వేరే ఉపాధిలోకి వెళ్ళిపోవడం వారి భవిష్యత్ కు మంచిదని పరిశీలకుల మాట కూడా.