Site icon TeluguMirchi.com

చంద్రబాబుకు ఇకనైనా కనువిప్పు కలగాలి

మూడు రాజధానులను చేస్తాం, అన్ని వర్గాలను న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆ మేరకు చట్టాన్ని చేశారు. అయితే అది న్యాయస్థానంలో ఉంది. టీడీపీ , చంద్రబాబు నాయుడు అండ్ కో దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఐతే ఈ న్యాయ పోరాటాన్ని జనాలు పట్టించు కోవడం లేదు. అటు గుంటూరు ప్రజలు, ఇటు విశాఖ ప్రజలు జగన్ వైపే వున్నారు. తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాలు దీనికి అద్దం పట్టాయి . విశాఖ ని రాజధానిగా ప్రజలు ఒప్పుకోవడంలేదని ఇప్పటిదాకా మాట్లాడిన తెలుగుదేశం అధినాయకులకు దిమ్మతిరిగే తీర్పుని విశాఖ జనం ఇచ్చారు.


విశాఖలో వైసీపీని గెలిపించడం  ద్వారా రాజధానికే ఓటేశారని చెప్పుకోవాలి . విశాఖవాసులు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగ అయ్యింది. ఇక గుంటూరు లో కూడా వైసీపీ హవా కొనసాగింది. పోనీ గుంటూరు ప్రజలు బాబు కి అండగా నిలుస్తారని ఆశ పెట్టుకుంటే ఇక్కడా షాక్ ఇచ్చారు. మొత్తానికి చంద్రబాబు ఈ ఓటమి తో నైనా కనువిప్పు కలగాలి . బాబు ఇంకా రాజధాని పాట పట్టుకుంటే టీడీపీ  తీవ్రంగా నష్ట పోతుంది. మూడు రాజధానులు వద్దు అనేది బాబు వాదన . మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి  చేస్తాం అనేది వైసీపీ మాట . అంతే కాదు బాబు అమరావతి ని తన ఎస్టెస్ట్ ఎస్టేట్ అడ్డాగా మార్చాడని ఆరోపిస్తుంది వైసీపీ .ఎన్నికల ఫలితాలు చుస్తే వైసీపీనే ప్రజలు నమ్మారు అని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇప్పుడు చంద్ర బాబు కనుక ఇంకా పాత పాట లోనే ఉంటే మాత్రం రానున్న ఎన్నికల్లో కూడా ఇదే సీన్ చూడాల్సి వస్తుంది. అందుచేత చంద్రబాబు ప్లాన్ అఫ్ యాక్షన్ మార్చాలి . ఇంక అంతే సంగతులు 

Exit mobile version