‘చంద్రన్న రక్తపాత దినోత్సవం”

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు. బషీర్‌బాగ్‌ కాల్పులు జరిగి 20 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో చంద్రబాబుకు చురకలంటించారు. ‘ విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న ”వెన్నుపోటు” దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్ట్28 ”చంద్రన్న రక్తపాత దినోత్సవం” జరుపుకుంటున్నారు. బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు.’ అంటూ విమర్శించారు.

సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి సీఎం చంద్రబాబు నాయుడి పాలనలో హైదరాబాద్‌ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిన సంగతి తెలిసిందే.