కరోనా మహమ్మారి తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పెరుగుతుంది. ప్రతి రోజు వేల సంఖ్య లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కేవలం కేసులు మాత్రమే కాదు మరణాల సంఖ్య సైతం అంతే విధంగా పెరుగుతున్నాయి. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే లాక్ డౌన్ సడలింపు ముందు వరకు పెద్దగా కేసులు నమోదు కాలేదు కానీ సడలింపుల అనంతరం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని ఎర్రపాలెం గ్రామ పంచాయితీ స్వయంగా లాక్ డౌన్ ప్రకటించుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదిహేను రోజులపాటు లాక్ డౌన్ విధించాలని ఎర్రపాలెం గ్రామ పంచాయతీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రిలీజ్ చేస్తామని గ్రామ పంచాయితీ పేర్కొన్నది.