కేసీఆర్’కు తెలుగు కృతజ్ఝతలు

తెలంగాణ రాష్ట్రంలో తెలుగు బాషను ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిర్ణయం తీసుకొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ని పలువు అభినందిస్తున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నా. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి మాతృ భాషకు ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా త్వరలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ ట్విట్ చేశాడు వెంకయ్య.

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా కేసీఆర్ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘మన మాతృ భాష తెలుగును పాఠశాలల్లో తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని సంకల్పించిన మన తెలంగాణ గాంధీ కేసీఆర్ గారికి నా అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు మనోజ్.