కుప్పం ప్రజలని చంద్రబాబు అవమానించారా ?

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు మాజీ సిఎం చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణుల‌కు షాక్ ఇచ్చాయి. ఏకంగా 89 పంచాయ‌తీల‌కు గాను, 74 స్థానాల్లో వైసీపీ మ‌ద్దతుదారులు గెల‌వ‌డం, టీడీపీ మ‌ద్దతుదారులు 14 స్థానాల‌కు ప‌డిపోవ‌డం కోలుకోలేని షాక్  ఇచ్చింది. ఐతే ఈ ఫలితాలపై చంద్రబాబు మాట్లాడిన తీరు ఒక్కింత షాకింగ్ గా వుంది.
” కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ ఓడిపోలేదు. ప్రజాస్వామ్యమే ఓడింది. నా నియోజకవర్గానికి కోట్ల రూపాయలు పంపి వెదజల్లారు. ఓట్లు కొనుకున్నారు” అంటూ ఓటమికి ప్రజలనే భాధ్యులని  చేసినట్లు మాట్లాడారుచంద్రబాబు. దీంతో చంద్రబాబు మాటలని పోస్ట్ మార్టం చేయడం మొదలుపెట్టారు కొందరు.

చంద్రబాబు మాటలు వింటుంటే కుప్పం ప్రజలు డబ్బుకి అమ్ముడుపోతారనే అర్ధం వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోకుండా కేవలం డబ్బులు పంచడం వలన వైసీపీ గెలిచిందని అనడం,, కుప్పం ప్రజల్ని అవమానించడమేనని అంటున్నారు కొందరు. వైసీపీ పై విమర్శలు చేసే ముందు చంద్రబాబు ఒక్కసారి ఆత్మ పరిశీలిన చేసుకోవాలని, అసలు ఎన్నికల్లో టీడీపీ పోరాట పటిమ కనబరించిందా ? అసలు స్థానిక టీడీపీ నేతలకు నాయకుడిగా చంద్రబాబు ఇచ్చిన భరోసా ఏమిటి ? అనే విషయం కూడా పరిశీలించుకోవాలని హితవు పలుకుతున్నారు కొందరు పరిశీలకులు.