Site icon TeluguMirchi.com

కిషన్ రెడ్డి నియామకం వెనుక కేసీఆర్ హస్తం

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి నియామకం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు.

ఢిల్లీ పర్యటన సందర్భంగా బీజేపీకి సహకరిస్తానని ప్రధాని మోదీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. తమిళనాడు ఎన్నికలకు బీజేపీకి కేసీఆర్ నిధులను సమకూరుస్తున్నారని చెప్పారు.

తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులను తమిళనాడులో పెట్టి బీజేపీకి కేసీఆర్ సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అధికారులు తమిళనాడులో ఉన్నారనే అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  

Exit mobile version