కరోనా మహమ్మారి బారినపడిన కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యముగా హైదరాబాద్ లో మహానగరంలో రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలనుండి సినీ , రాజకీయ నేతలు ఇలా అన్ని రంగాలవారు కరోనా బారినపడగా…తాజాగా తెరాస కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌ కరోనా బారినపడ్డారు.ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్‌ సోకినట్లు ఆదివారం డాక్టర్లు వెల్లడించారు.

దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబం డాక్టర్ల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందనున్నారు.