Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోన‌ప్ప ఫ్యామిలీ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగిస్తోంది. సామాన్య ప్రజలే కాదు రాజకీయ నేతలు సైతం దీనిబారినపడుతున్నారు. తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప దంప‌తులు కరోనా బారిన పడ్డారు.

గ‌త రెండు, మూడు రోజులుగా స్వ‌ల్ప అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న కోన‌ప్ప దంప‌తులు బుధ‌వారం క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా.. వారిద్ద‌రికి పాజిటివ్‌గా తేలిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. దీంతో కాగ‌జ్ న‌గ‌ర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో ప్ర‌త్యేక ఐసోలేష‌న్‌లో చికిత్స తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version